పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
85
ద్వారకనాథ మితర్దొరగారు తనతోడి జడ్జీయగు ద్వారకనాథుని యభిప్రాయములతో దరుచుగ నేకీభవించుచు నెప్పుడైన నభిప్రాయభేదము గలిగినప్పుడు మిక్కిలి జంకుతో భేదించుచుండునఁట. అతఁడు గడుసుపోకడలఁ బోయి మోసముపన్ని కువాదములు చేయువారినిఁ జూచిన మిక్కిలి యసహ్యపడి యట్టివారి గర్వభంజనము చేయుచువచ్చెను. అందుచే నతనిమీఁద కొందఱ కాగ్రహము ననిష్టముగలుగ వార్తాపత్రికలలో వారతని నిందింప నారంభించిరి. ద్వారకనాథుఁ డావ్రాతఁల నించుకేనియు సరకుసేయఁడయ్యెను. అయినను ముఖ్యన్యాయాధిపతియగు పీకాకుదొరగారు ద్వారకనాథినిపైఁగల యభిమానముచే జననిందా స్పదుడగుటకు నిష్టపడక వానినాయపవాదమునుండి తప్పింపవలయునని యొకమారు కచ్చేరిలో నున్నపుడే యిట్లనియె. "నేనీద్వారకనాథుని న్యాయవాదిగా నున్న కాలమునుండియు నెరుఁగుదును. కొంతకాలము నుండి యతనిసాటి న్యాయాధిపతినై యుంటిని. కాబట్టి యతని స్వభావమును గూర్చియు నతని నడతనుగూర్చియుఁ దక్కినవారి కంటె నా కెక్కువ దెలియుట కవకాశమున్నది. నేనిప్పు డాయన యెదుట మాటలాడుచున్నాను ద్వారకనాథుడు మిక్కిలి విద్యావంతుడనియు సమర్థుడనియు నిగర్వచూడామణి యనియు మంచిమనస్సు గలవాఁడనియు దయాళువనియు స్నేహపాత్రుఁ డనియు స్వతంత్రుఁ డనియు జెప్పవలయును. అతఁడు తనకు సరియని తోఁచిన యభిప్రాయ మెవరు భిన్నముగాఁ జెప్పినను విడువక దాని ననుసరించియే యుండును. అది తప్పనితోఁచినప్పు డెవరుచెప్పకయే దానిని విడుచును."

ద్వారకనాథుఁడు తీరికయున్నప్పుడు ఫ్రెంచి లాటిను భాషల యందు బరిశ్రమఁజేయుచువచ్చెను. ఫ్రెంచిభాషలో నతఁడు చదివిన గ్రంథములలో కోవిం (Comte) యను తత్త్వశాస్త్రజ్ఞుడు రచియించిన