పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
84
మహాపురుషుల జీవితములుకలకత్తా హైకోర్టులో పదునైదుగురు జడ్జీలు విచారణచేసిరి. ఆవ్యాజ్యము విచారణ మనేకదినములు పట్టినందున ద్వారకనాథుఁడు ప్రతిదినము పదకొండు గంటలకులేచి సాయంకాల మైదుగంటలవఱకు నిలువంబడియే వాదనసేయుచు దేహమలసినను తనవాదనమాత్రము బలహీనము గాకుండునట్లుచెప్పి చూచువారి కందఱకు మహాద్భుతమును గొలిపెను. ఆవ్యాజ్యమున న్యాయసభలోని ముఖ్యన్యాయాధిపతి ద్వారకనాథునిపై యించుక కక్షఁబూని మాటిమాటికి యక్షప్రశ్నలవంటి ప్రశ్నలువేసి యీతనిం దడఁబడఁజేయుటకు బ్రయత్నముచేయుచువచ్చెను. కాని యాదిట్టరియొక్క ప్రశ్నకైనను దడఁబడక న్యాయాధిపతులందరు నివ్వెరపడునట్టు ప్రత్యుత్తర మిచ్చెను. ఈవ్యాజ్యమున నితఁడు చూపినఁ యసాధారణ ప్రజ్ఞచేత ననంతరము కొన్ని దినములలో దొరతనమువారిన్యాయవాది (గవర్నమెంటు ప్లీడరు) గా నేర్పరుపఁబడెను. దీనిలోనుండియే యతఁడు కొలది కాలమున హైకోర్టు జడ్జీగా నియమింపఁబడెను.

అదివరకు శంభునాథపండితుఁ డను నతఁడా హైకోర్టులో న్యాయాధిపతిగా నుండెను. ఆతఁడె బంగాళాహైకోర్టులో మొట్టమొదటి న్యాయాధిపతి. అతఁడు 1867 వ సంవత్సరమున జూనునెల యాఱవ తేదిని లోకాంతరగతుఁ డయ్యె. అప్పటికి ద్వారకనాథుఁడు ముప్పదిమూడేండ్ల వయసువాఁడు. ఇదివరకు హిందూదేశమున హైకోర్టుజడ్జీలుగా నియమింపఁబడిన స్వదేశస్థులలో నింతచిన్న వయసువారెవ్వరునులేరు. ఇంతటి పిన్నప్రాయమువాని నంతటి మహాపదవికి దొరతనమువారు నిశ్శంకముగా నియమించుటచేతనే యాతఁ డెంతటి బుద్ధిశాలియో యెంతటి ప్రజ్ఞావంతుఁడో మూహింపవచ్చును. ద్వారకనాథుఁ డారుసంవత్సరము లాహైకోర్టునందు న్యాయాధిపతిగా నుండెను. అప్పటి ముఖ్యనాయాధిపతియగు సర్ బార్నిసు పీకాకు