పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
83
ద్వారకనాథ మితర్న్యాయవాదిగానున్న యొక దొర ద్వారకనాథుని యప్పటి తెలివితేటలఁ గూర్చి యిట్లు వ్రాసెను. ద్వారకనాథుఁడు వాదనకు దిగినప్పుడు నాతోఁ గలిసిపనిచేసినను నాకెదుటిపక్షమునం బనిచేసినను నాకును వినువారి కందఱకును మిక్కిలి యద్బుతమును గొలుపుచుండువాఁడు."

1862 వ సంవత్సరమున బంగాళాదేశమం దగ్రన్యాయసభ అనఁగా హైకోర్టు స్థాపింపఁబడెను. అది యేర్పడినది మొదలు ద్వారకనాథుని ఖ్యాతి యంతకంత కెక్కువయ్యెను. ఖ్యాతితోఁగూడ ధనార్జనము నతిశయించెను. ఏలయన నతఁడా న్యాయసభలోఁ బని నారంభించునప్పటికి వానికంటె నెక్కువ యభ్యాసము నెక్కు పేరు గల న్యాయవాదు లిరువు రుండిరి. వారిరువురిలో నొకఁడు మృతినొందుటయు రెండవయతఁడు న్యాయాధిపతి యగుటయుఁ దటస్థించెను. అందుచే నతఁడచ్చటి న్యాయవాదులికెల్ల నాయకుఁడయ్యెను. ఆకారణమున దేశస్థులందఱు బనివచ్చినప్పు డతని సహాయమునే కోరుచువచ్చిరి. న్యాయవాదిగా నున్నపు డతఁడు నిర్భయుఁడై స్వతంత్రుఁడై యుండి పేదల కేవియేని చిక్కులు సంభవించినపుడు ధనము గ్రహింపకయే వారిపక్షముబూని వాదించుటకు సిద్ధముగ నుండును.

మనదేశమున కింగ్లీషువర్తకులు కొందరువచ్చి బంగాళాపరిగణాలో నీలిమందు, కాపీవిత్తులు, తేయాకు మొదలగు సరకులు పండించి లాభ మపారముగ గ్రహించుచున్నారు. 1865 వ సంవత్సర మందా దొరలు కొందరును బంగాళాదేశపు జమీందారులు కొందఱును గలసి శిస్తుల నిమిత్తము రైతులను బాధించి వారిపై హైకోర్టులో గొప్పవ్యాజ్యము తెచ్చిరి. అప్పుడు ద్వారకానాథుఁడు దీనదశలోనున్న రైతులపక్షముఁబూని వాదించెను. ఆ వ్యాజ్యములు