పుట:Mahaakavi dairiilu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

డైరీలు


8 నవంబరు :

మహారాజావారి నాటక సమాజమువారు 'శకుంతల' ప్రదర్శించిరి. మహారాజావారు ప్రదర్శనమునకు విచ్చేసిరి.

10 నవంబరు :

మహారాజావారు విజయనగరంనుంచి బయలుదేరారు.

1891

30 జూన్ :

దేవరపల్లిలో రాజమ్మ వివాహమహోత్సవం.

1892

17 అక్టోబరు :

మహారాజావారివద్ద రెండువేల రూపాయిలు బదులు పుచ్చుకున్నాను.

1893

10 డిసెంబరు, ఆదివారం :

ఉదయము 5 గంటలుకు ఆడుతూ పాడుతూ భోజనం చేసి 7 గంటలుకు విజయనగరంలో రెయిలు యెక్కడమైనది. రెయిలు పడివరకు యెప్పుడు పడునని ఆసక్తితో యెదురు చూచుచుంటిమి; గాని రెయిలు పడ్డతర్వాతకూడ గొణగడముకు కావలసినన్ని అవకాశములు రెయిల్వేవారు కల్పించినారు. ఊళ్ళదగ్గిర స్టేషనులు వుంటే ఉపద్రవము వస్తుందని