పుట:Mahaakavi dairiilu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8

మహాకవి డైరీలను వొక సంపుటిగా అచ్చొత్తించి ఆంధ్రప్రజలకు అందివ్వ గలుగుతున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాము.

ఇటు సంఘములోనూ, అటు సాహిత్యములోనూ మహాకవి ప్రారంభించిన విప్లవమునకు ఏయే హేతువులు ఆధారమైనవీ, గొప్ప సాహిత్యపురుషుడుగా ఆయన పరిణతి చెందడానికి యే పరిస్థితులు దోహదపడ్డవీ, నాటి సమకాలిక ఆంధ్రదేశ స్థితిగతులను, ఆనాటి 'రినైజాన్సు' దినములలో అంతర్గతముగ ప్రవహించే ధోరణులను, భావాలవెల్లువలను,దేశ సామాజిక జీవితమునూ ప్రతిబింబించే నిలువుటద్దము యీ సంపుటి.

అద్దమును ఒకసారి దర్శించడమే పాఠకుడి కిక తరవాయి!

-అవసరాల సూర్యారావు.