పుట:Mahaakavi dairiilu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7


అన్నిటా వారి దృష్టి మళ్ళినది. ఈరోజులలోనే ఆయన భాషాశాస్త్ర విషయములను, భాషల వింగడింపును సునిశితముగా పరిశీలించుతూ వచ్చినట్లు కనిపిస్తుంది. గ్రీకు రోమను సారస్వత విజృంభణమువల్ల యూరపులో స్వదేశీయ సాహిత్య విస్తరణము కలిగినట్లు, ఆంగ్లసాహిత్య ప్రభావమువల్ల భారతదేశంలో మన వాఙ్మయమేల వికసించకున్నదీ, తమిళ దేశములో త్యాగయ్య కృతులే ప్రచారములో వుండనేల, నాటకములను అభినయించు నటులు వచన రూపకముల స్మరంతికే పోరేమి; ఇవన్నీ ఆనాడు ఆయన తనను తాను వేసుకున్న ప్రశ్నలు. మహాకవి మాటలలోనే "పరస్పర వ్యత్యాసముగల, విభిన్న సంస్కృతులు రెండింటి మధ్య" ఆనాటిజనులు జీవించవలసి వచ్చినది. ఇవి ప్రాచ్యపాశ్చాత్య సంస్కృతులుః "ఇందులో వొక సంస్కృతి పూర్తిగా చివికి శల్యావశిష్టమైనది, తనకు గల సంకుచితత్వమేదాని దుర్బలత్వమునకు హేతువు. పాశ్చాత్య నాగరికత కొన్ని ఆంధ్రవిశ్వాసాలను పోగొట్టుతున్న మాట యధార్ధమే అయినప్పటికీ, అది ప్రబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. ఇది అన్యులకు చోటివ్వదు. ఇది సంపూర్ణ స్వాతంత్ర్యము గాదు. నామ మాత్రమైనది."

కనుకనే 'చదల చీకటి కదల' బారగ 'తూర్పు బల బల తెల్లవారగ' స్వచ్ఛమూ నిసర్గసుందరమూ అయిన తీయ తీయని గొంతుతో "కొత్త పాతల మేలు కలయిక, క్రొమ్మెరుంగులు జిమ్మగా" 'యెక్కడనో వొక్క చెట్టుమాటున నొక్క కోకిల పలుకసాగి'నది. "పలుకులను విని దేశమందభిమానములు మొలకలెత్తి"నవి.