పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

ప్లూటార్కు వర్ణితచరిత్రలు

ఇంతలో సిరాక్యూజ నగరవాసులకు కొందఱు సహాయులైనందున వారు తిరుగంబడి నిసియస్సును రణములో నోడించిరి. నౌకాహవములోకూడ నతఁడు పరాభవము నొందెను. వారు తరుముకొని వచ్చుటచేత నతఁడు పట్టణములోఁ బ్రవేశించెను. అతఁడు కట్టించుచున్న పరిఘలమూలమున బయట కతనికిగాని నతని సైనికులకుగాని రా వీలులేక పోయెను. రేవుపట్టణమును వారు పట్టుకొనినందున వీ రా మార్గముననైనఁ బారిపోలేకపోయిరి. ఈ దురవస్థను అధీనియనులు విని మఱి కొంత సైన్యమును జేర్చి 'డెమాస్తనీసు'ను సేనానిగఁ జేసిపంపిరి. వారు వచ్చి నిసియస్సు చేసిన సలహా ప్రకారము నడవక వెంటనే యుద్ధమునకుఁ గడచిరి. ఈ యుద్ధములో రెండువేల ఆథీనియనులు వీరస్వర్గమును బొందిరి. 'డెమాస్తనీసు'యొక్క తొందరపాటుచేత నీ యపజయము అధీనియనులకుఁ గలిగెను. సైనికులు నిరుత్సాహులైరి. వారు ఘాపితులై కృశించిరి. వారికి సహాయ మిచ్చుటకు స్వదేశము నుండి సైన్యము వచ్చు విధము గనఁబడదు.

అప్పుడు అథీనియనులు నావల నెక్కి స్వదేశోన్ముఖులైరి. శత్రువులు పరస్పరముగ నున్నట్లుండి, వారు బయలుదేరి నావలను గడుపుచుండ మిడుతల దండువలె యుద్ధనావలతో నాక్రమించి ఘోరముగ సముద్రముమీఁదఁ బోరాడిరి. అథీనియనుల యుధ్ధనావలు భారము కలవియగుటచేత