పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిసియస్సు

69


సత్పాత్రులను జూచి యతఁడు దానము చేయుచుండెను. భయశీలుఁడుగాన నతనిని నెరిపించి దుర్మార్గులు ధనమును స్వీకరించుచుండిరి.

'ఆథెన్సు' పట్టణములో నతఁడు 'ఆర్కను' అను పేరున నొక న్యాయాధికారిగ నియోగింపఁబడెను. ముఖీశాల కందఱికంటె ముందుగ నతఁడు బోవును. అక్కడనుండి లేఖకులు వెళ్లినపైని అతఁడు వచ్చును. పురవాసులతోఁ గలిసి మెలిసి తిరుగుట కతఁడు భయపడుచుండెను. వారిని తన గృహమునకు భోజనమునకు బిలచుటగాని వారి గృహములకు నతఁడు వెళ్లుటగాని లేదు. ఇతరు లతని దర్శనమునకు వచ్చిన భయము చేత వారికి దర్శన మియ్యక వారిని బంపివేయుచుండెను. సెలవుదినములలోఁ గవాటములు వేసి స్వగృహములో నతఁడు మెసలుచుండెను. వేయేల? నిసియస్సుయొక్క జీవితకాల మంతయు జాగరూకతతోఁ గడుపఁబడెను. అతఁడు యజమాని యైనను బ్రజలవిషయమై పాటుపడెను. వాచాలత్వము సామర్థ్యము గలవారిచేతఁ బ్రజలు పనులను చేయించుకొనినను వారి నీర్ష్యతోఁ జూచుట కలదని యతని యభిప్రాయము. అందుచేత నేపనికైన సతఁడుఁ బూనుకొన లేదు. ముందు వెనుక లాలోచించి పూనుకొనినపని నతఁడు సొంతముచేసి జయమును బొందుచుండెను. ప్రజల కీర్ష్య కలుగునను భయముచేత కొంచెము తన ప్రతాపమువలన కలిగినను జయ మదృ