పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరియ లేనస్సు

61


చెను. అప్పుడు జీర్ణకోశము వానిఁ జూచి "మీరు మందబుద్ధిఁగలవారు. పదార్థములను మీరు తెచ్చి నాయెదుటఁ బెట్టిన నేను వానిని పక్వముచేసి, రక్తముగ మార్చి, దానిని నాళముల ద్వారా మీకుఁ బంపుచుందును. అందుచేత మీరు బలము కలిగి వర్తించుచున్నారు. నేను సోమరిగ నుండలేదని మందిలించినపైని యవయవములన్నియు తమ తమ పనులను నిర్వర్తించుచుండెను. మీరుఁగూడ నా యవయవములవలె మందబుద్ధిఁ గలవా"రని ముచ్చటించి వారి కోపమును మాన్చెను. ప్రజలు వారి వారి పనుల ననుసరించి వెళ్లిరి; రెండవ పర్యాయముఁగూడ వారు యుద్ధమునకు సహాయులై వెళ్లిరి. ఇందులో వారు శత్రువులకు వీపుచూపి పరుగిడుచున్నప్పుడు, వారిని సమావేశముచేసి మఱలించి యుద్ధమునకు దీసికొని పోయి 'కోరియలేనస్సు' జయమును బొందెను. ఇటుల 'కోరియోలీ' యను పట్టణమును పట్టుకొనినందున నతనికి 'కోరియలేనస్స'ను పౌరుషనామము కలిగెను. విజయమును బొంది వారు రాజు ధానిం జేరి మఱుచటిదినమున 'కోరియలేనస్సు'ను వేనోళ్లఁ గొనియాడి మన్నించి బహువిధముల సత్కరించిరి. కొల్ల పెట్టి తెచ్చిన ద్రవ్యములో నొక దశాంశమును నొక శ్వేతాశ్వమును నతనికి బహుమానముగ వారిచ్చిరి. అప్పు డతఁడు సభలో లేచి 'నా విజ్ఞాపన యొకటి యున్నది దానిని తమరు మన్నించవలెను. శత్రుపక్షములోనివాఁ డొకఁడు నా కతిథిసత్కారము