పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


పడిన కష్టములను వారితో నతఁడు చెప్పి గ్రహపాటుచేత నవి కలిగెనని యతఁడు పలికెను. కొంతవఱకు వారు విచారించిరి. ఏరోజున నతఁడు స్వగ్రామమును చేరేనో నారోజు 'మినేర్వా' దేవతయొక్క నిజరూపదర్శనదిన మయ్యెను. ఆరోజున వారు దేవతను చూచుటకు వీలులేదు. అతఁ డా దినమున విజయము చేయుటచేత శుభసూచకము" "కాదని వారు తలంచిరి.

ఇంతలో స్పార్టనులకు ఆధీనియనులకు తిరుగ జగడము వచ్చెను. స్పార్టనులు రాజ్యాధిపత్యములోనివారు, అథీనియనులు ప్రజారాజ్యములోనివారు. వీరు మైత్రితో నుండుట దుర్లభము. వీరి ప్రజారాజ్యమును మాపివేయవలె నని వారు కోరుచుండిరి. కాని శూరుఁడైన 'ఆల్సిబియూడీసు' జీవించియున్నంతవఱ కది సమకూడ దని యెంచి వా రతనిని, యమ మందిరమునకుఁ బంపుటకుఁగాను కొందఱి దుష్టులను సన్నద్ధము చేసిపంపిరి.

అతఁ డప్పుడొక చిన్న గ్రామములోఁ దనప్రియురాలితోఁ గలిసియుండెను. ఒకనాఁటిరాత్రి, తాను తన ప్రియురాలి వస్త్రములను ధరింప నామె వచ్చి తన్ను కౌగలించుకొని, తన ముఖమును స్త్రీ ముఖముగ దిద్దినటుల నతఁడు స్వప్నముఁ గనెను. అతని నెదిరించుటకు భయపడి ఘాతకులతని గృహమునకు నిప్పు ముట్టించిరి. అప్పు డతఁడు బట్టలు