పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


వంశస్థాపకుఁడైన చండ్రగుప్తమహారాజునకు వశ్యులై, గ్రీకుల రాజ్యమునకు వ్యవధి లేనందున నది మణిఁగిపోయెను. వారి దేశభాషాచారములను మన మవలంబించి యుండినచో, నేఁడు మన యవస్థ యెటుల నుండియుండునో పరమేశ్వరునికిఁ దెలియును. ఇట్లు మేఘమధ్యమును వెలువడి వెలుంగు క్రొక్కారు. మెఱుంగు తెఱుంగున, గ్రీకుల రాజ్యము భరత వర్షంబునఁ బ్రకాశించెను.