పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహా అలగ్జాండరు

35


విలోమముగ సంచరించు విధమున, దేశము లానుపూర్వముగ ననుభవించుచున్న రాజ్యాంగములను మాపివేసి నూతన రాజ్యాంగములను స్థాపింపనందున, దేశవాసులు స్వాస్థ్యము లేక సంచరించుచుండిరి. ఇట్టి యరాజకస్థితిలోఁ డండ్రి కాలముఁ జేయుటయు, అలగ్జాండరు సింహాసనమునకు వచ్చుటయు జరిగెను. చతురంగబలముల నడపి, చతురోపాయములచేత నరాజక దేశంబుల నర్థమునకును బ్రాణమునకును క్షేమం బొసంగి, అలగ్జాండరు వానికి ప్రశాంతమును గలుగఁ జేసెను. రథగజతురఁగపదాతి యూధంబుల నొక యక్షౌహిణి బలము సమకూర్చి దిగ్విజయమున కతఁడు బయలు వెడలెను.

ఒక సుముహూర్తంబున మహా దంతావళంబు నధిరోహించి, 'వారాశి ప్రావృత మేదినీవలయసామ్రాజ్యంబుఁ, గైకొనుట' కతఁడు బయలువెడలెను.

“హయ హేషల్ గజ బృంహితంబులు రధాంగారావముల్ శింజినీ |
చయటంకారములున్ వినర్థిత గదాచక్రాస్తనాదంబులున్ !
జయశబ్దంబులు భేరిభాంకృతులు నిస్సాణాదిఘోషంబులున్ |
భయదప్రక్రియ నొక్కవీక సెగసెస్ బ్రహ్మాండ భేదంబుగన్”||

ఇట్లు సునాసీరనాసీరంబులు శిరస్త్రాణంబులు ధరించి, ధ్వజంబు లెత్తి దండనాయకు లుద్దండంబుగఁ గోదండంబులు సాచి స్వదండంబుల , దండించుచుఁ బ్రత్యానీకదండంబుల డంబంబు లణఁచి నడువ యవన బర్బర తురుష్క పార