పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


కళత్రమును వివాహమయ్యెను. దానిచేతఁ దండ్రీ కుమారులకు నైరము పొసఁగెను. అందుకుతోడు 'అలగ్జాండరు' తల్లి, కుమారుని తండ్రిపైకి పురికొల్పు చుండెను. ఒక రోజున, "రెండవ భార్యయైన 'క్లియోపాత్ర' యొక్క గర్భము ఫలించి, సింహాసనమునకుఁ దగిన కుమారునిఁ గనవలసిన”దని దైవప్రార్థనఁ జేయుఁ డని క్లియోపాత్ర పినతండ్రి నలుగురి యెదుటఁ జెప్పెను. "నే నౌరసపుత్రుఁడను కానని మీ యభిప్రాయము కాఁబోలు”నని యలగ్జాండరు ప్రశంసించెను. అంతలో రోషా వేశకంపమానగాత్రుండై , ఫిలిప్పు చంద్రాయుధమును ఝలిపించి కుమారుని శిరస్సుఁ దెగవ్రేయఁజూచెను, దైవికముగ ఫిలిప్పు కాదంబరీరసవిఘూర్ణితలోచనుఁడై యుండి నందువ, ననక్రమమున స్మారకముతప్పి నేలఁబడెను. "మాసిడను దేశవాసులారా, మీరు చూడుఁడు, నాలుగడుగులు వేయ లేనివాఁడు ఐరోపాఖండమునుండి ఆసియాఖండమునకుఁ బోదలచినాఁడని అలగ్జాండరు పలికెను.

ఫిలిప్పు కాలాంతరగతుఁ డయ్యెను. సింహాసనమునకు 'అలగ్జాండరు' వచ్చెను. అప్పటి కతని కిరువదిసంవత్సరముల ప్రాయము. దేశమంతయు నల్లకల్లోలముగనుండెను. దేశములను కొట్టి స్వదేశముతో వానినిఁ జేర్చుటయెగాని, వానికి తగిన రాజ్యాంగముల నిర్మించి, వానిని స్థిరముగ ఫిలిప్పుంచ లేదు. కలఁతఁ జెందిన జలములో కలుష రేణువు లనులోమ