పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డెమాస్తనీసు

19


నిలఁబెట్టుకొను స్థిరబుద్ధి యతనికి లేదని కొంద ఱనియెదరు. అయినను మొదట నవలంబించినపక్షములను సిద్ధాంతములను సాంతముగ నతఁడు పరిగ్రహించినటులఁ గనఁబడుచున్నది, ప్రాణములను విడుచుట కతఁ డొప్పుకొనెనుగాని వాని నతిక్రమించుట కియ్యకొన లేదు. మాటలలోను క్రియలలో నతఁడెప్పటి కామాటలాడువాఁడుకాఁడు. రాజ్యతంత్రములోని రహస్యమును గుర్తెఱెఁగి దాని ననుసరించి యతఁడు నడిచెను, ధర్మము ధర్మముకొఱకె యనుష్ఠించవలసిన దను నియామకమున కనుగుణ్యముగ నతని ప్రవచనములు వ్రాయఁబడెను. ప్రియమైనవి, సుళువైనవి, లేక లాభకరమైన పనులను జేయవలసిన దని ప్రజల నితఁడు వీని మూలమున హెచ్చరించలేదు. కీర్తి ప్రతిష్ఠలను నిలుపుకొనుటయే ముఖ్య మనియు, రాజ్యము యొక్క క్షేమమంతగ యెన్నిక చేయవలసిన యంశము కాదనియు, వారి కతఁడు బోధించెను. మాటల కనుగుణ్యమైన క్రియలు, క్రియల కుపయుక్తమైన మాటలు కలిగినవాఁడైనను, యుద్ధముఁ జేయుటకుఁ దగిన ధైర్య స్తైర్యములు లేక లంచములు పుచ్చుకొననివాఁడైన పక్షమున నతఁ డధికముగ మన్ననలను బడసియుండును. రణరంగమున విచ్చలవిడిగ సంచరించుటకుఁ దగినంత ధైర్య మతనికిలేదు; వాడియైన సిరిచూపు లతని మనస్సును నొప్పించక యుండలేదు.

సమయము దొరికినపుడెల్ల 'మాసిడను' మండలాధీశ్వరుఁ