పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డెమాస్తనీసు

17


కావ్యమునో ప్రవచనమునో సమ స్థలములను ఉచ్చభూములను బరుగెత్తుచు నతఁ డుపన్యసించుచుండెను. స్వగృహమున నొక దర్పణము నిడుకొని దానిముందట మాటలాడుచు హస్తవిన్యాసముల నతఁ డభ్యసించెను. ఒక సమయమున నొకఁడు పరిభవమును బొంది తన పక్షమున సభలో వాదించుట కితనిని రావలసినదని వేఁడుకొనెను. 'నీవు పరిభవముఁ బొందిన వానివలె గనఁబడవే?' యని డెమాస్తనీసు తర్జింప, 'సరి, సరి, నేను దెబ్బలు తినలేదనియా మీ యభిప్రాయ'మని వాఁడు గర్జించెను. “నీవిప్పుడు దెబ్బలు తిన్నవానివలెఁ గనఁబడుచున్నావని డెమాస్తనీసు మాటను కలి పెను.

"ఆకారైరింగితైర్గత్యా చేష్టయా భాషణేవచ |
నేత్రవక్త్రవికారేణ లక్ష్యతేంతర్గతంమఃనః||"

అని డెమాస్తనీ సభిప్రాయపడెను.

అతని వక్తృత్వములు సర్వజనశ్లాఘనీయము లయినను, రసికులు కొందఱు వానిని నీరసించిరి. వీని రచనశైలి చాతుర్య సంశోభితంబై మనోభేదవపాటవ ప్రశస్తంబుగ నుండెను. లిఖత రూపముగనున్న ప్రవచనములు మనోశకలమును గలిగించు చున్నను నతని సరసోక్తులు , శ్రవణానందముగ నున్నవి.

'ఫోకియను'ల యుద్ధ ప్రారంభసమయమున నతఁడు వ్యవహారములలో దిగినటులఁ గనఁబడుచున్నది. అతఁడు వ్రాసిన