పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ముఁజొచ్చి, విధి నిషేధపక్షములఁ జర్చించి విషయాంశమును వితర్కించుచుండెను. కొన్ని ప్రవచనీయములను మనన చేసి వానిని యుక్తముగ సంస్కరించి, యతఁడు జిహ్వాగ్రమున నుంచు కొనెను. సభలో నతనిని పేరు పెట్టి పిలిచి సాంప్రతవిషయము గుఱించి ముచ్చటించనలసిన దని సభ్యలు కోరిన దాని నతఁ డసంభావపూర్వకముగఁ బ్రసంగించుట లేదు, అందు చేత నతఁడు ధారణాశక్తిలేనివాఁడనియు, నతని వాక్చాతుర్యము వ్యవసాయ ఫల మనియు, పకు లెంచిరి.

'పెరికిలీసు' నతఁ డా దర్శముగ దీసికొన లేదు. అస్ఖలిత భాషణమును, హస్తాద్యభినయములను నాతనినుండి యితఁడు నేర్చుకొనుటయేగాక అతనివలె నాకస్మిక ప్రవృత్యానుసారోదిత వాదములయందుఁ బ్రతికూల మనస్కుఁడయ్యెను. వాని యౌన్నత్యమున కిదియే కారణ మని యితని యభిస్రాయము. అన్ని సమయములలోఁ దన వాక్శక్తులను దైవాధీనము లని యెంచకపోయినను ప్రాప్తకాలములయందు తన సభాపాండిత్య.మును బ్రకటనఁ జేయుట కతఁడు విముఖుఁడు కాలేదు. ప్రస్తావించినపుడెల్ల దైవబలము కలదో యనునటుల సతఁడు భాషించుచుండెను.

స్వదోషములను బోగొట్టుకొనుట కతఁడు కొన్ని ప్రతి విధానములను సమకూర్చెను. అస్పష్టభాషణమును బోగొట్టు కొనుటకు నోటిలో గులకరాళ్లను బెట్టుకొని కంఠస్థముగనున్న