పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


సాంప్రదాయముల నివి మరగుపఱచును. ఇది యొకటి. రెండవది యే దన, మన స్వాతంత్ర్యమువలనఁ గలుగు మహోత్కృష్ట పదవికంటె హెచ్చైన సమభావముఁ గలిగియుండుట మేలు; ఉచ్చ పదవిని బొంది, సమభావమును బోఁగొట్టుకొనుటకంటె శాస్త్ర జ్ఞానముచేత ధర్మమును నిలఁబెట్టి నిశ్చలతతోఁ గాలమును గడుపుట మనుజున కుచితమైన పని. ఈ విషయముల నతని జీవితచారిత్రమును జదివినచో మనము తెలిసికొనఁగలము.

గ్రీసుదేశములోఁ 'బియోషియా' యను పేరుగల యొక మండల ముండెను. అక్కడి ప్రజలు పశుప్రాయులుగ నుండుట చేతఁ 'బియోషియా మూర్ఖు'లని వారికిఁ బేరువచ్చెను. మనము 'గొల్లల మూర్ఖత్వ' మనునట్లు 'బియోషియా మూర్ఖత్వ'మని వాడుకకలదు. ఈ యపవాదమును బోఁగొట్టుటకు నా 'పిండారు' అను కవియు, 'అపామినందాసుఁ'డను వీరుఁడును నాదేశములోఁ బుట్టిరి. వారి తరువాత ప్రాజ్ఞుఁడైన 'ఫ్లూటార్కు' ఆ దేశములోఁ బుట్టి దానికిఁ గీర్తిఁ దెచ్చెను. అతఁడు క్రీ. శ. 66. సం|| రములో జననమొందినటులు తెలియుచున్నది.

'అమోనియస్సు' అను నొజ్జయొద్ద నతఁడు చదివెను. శిష్యుఁడు వ్రాసిన సంగతితప్ప మఱియొకటి గురువునుగుఱించి మనకుఁ దెలియదు. శిష్యుల నితఁ డెట్లు శిక్షించెనో దానిని 'ప్లూటార్కు' వ్రాసెను. “ఒకనాఁడు మధ్యాహ్నమున అతఁడు పాఠములను జెప్పుటకుఁ బూర్వము మేము భోజనము చేయు