1 మొదటి ప్రకరణము 3
56 - సం॥రములకుఁ బూర్వము కట్టఁబడి, అప్పటికి అయి
బాఱు వేల ప్రజాసంఖ్య గల ' బోస్టను ' పట్టణముఁ బ్రవేశించి, రంగు లద్దు వ్యాపారమునకుఁ దగిన ప్రోత్సాహము లేనందున, ‘జోషయాఫ్రాంక్లిన్లు' క్రొవ్వు కఱగించి, సబ్బు తయారుచేయు వ్యాపారమునందుఁ బ్రవేశించెను.
బోస్టనుపట్టణమునం దిటుల తన శాయశక్తుల వ్యాపారమును నడిపించుచు, నాలుగు డబ్బు లితఁడు సేకరించెను. ఇతని కుటుంబము సయితము నానాఁటికి వృద్ధిఁ బొందెను. 1685 సం॥రం ఆగస్టు తే.28 దిని, ఇతనికొక కుమారుఁడు గలిగెను. వానికి జోషయా యని నామకరణ మొనర్చిరి. సముద్ర మార్గమున పారిపోయి, చాల కాలము వఱకుఁ దన క్షేమసమాచారమల దెలియఁ జేయనందున, వీడు తల్లి దండ్రులకు దుఃఖముఁ గలుగఁజేసినవాఁ డయ్యెను. ఇతనిపోలిక పనుసరించి యితని కనిష్ఠ భ్రాత, బెంజమిను అనువాఁడు గూడ నటులనే చేసెను. సం॥ 1687-రము జనవరి తేదీని, జోషయా ప్రాంక్లినునకు 'ఆని' యనుకూఁతురు పుట్టెను. సం॥ 1688-రము ఫిబ్రవరి తే6 దిని జోసెఫనువాఁడు పుట్టి, శైశవదళయం దే స్వర్గస్థుఁడాయెను. తరువాత సం॥ 1689-రము జూన్ తే.30 దీని మఱియొకజో సెఫను కుమారుఁడు గలిగెను. ఏడుగురు బిడ్డలనుకని తనకు సం॥ 35-రముల వయస్సువ, జోషయా ఫ్రాంక్లిన్లు గారి