పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


రాజ్యమునకు ముప్పుదెచ్చు నని గ్రీకులకుఁ దోఁచినయెడల, వానిని దేశమునుండి వెడలఁగొట్టుచుండిరి. వాఁడు పరదేశములోఁ బదిసంవత్సరము లుండి, తదుపరి స్వదేశమునకు రా వచ్చును. ఈలోపున వాని స్వామ్యము లేవియు పోకుండ గాపాడుట కలదు.

ప్రజలందఱు సమావేశమై, చీట్లు వేసికొని, వానిలో నెవని పేరున హెచ్చుచీట్లు వచ్చిన వానిని పరదేశమునకుఁ బంపుచుండిరి. అప్పుడొకఁ డారిస్టైడీనని తెలియక, యతని వద్దకువచ్చి, చీటిపైని 'ఆరిస్టైడీసు' పేరు వ్రాయమని కోరెను. అందు కతఁ డాశ్చర్యమొంది, “నీ కతఁ డేమైన కీడుచేసెనా" యని వాని నడుగ, "అతఁ డెవఁడో నేనెఱుఁగను. అతనిని సమవర్తి యని పిలిచిన పిలుపులు నా చెవులకు ములుకులవలె నంటుచున్నవి. అందుచేత, అతఁడు దేశమునుండి పోవుట మంచి దని నా యభిప్రాయ”మని వాఁడు బదులు చెప్పెను. అతఁడా ప్రశారము చీటి వ్రాసి వాని కిచ్చివేసెను.

ఇంతలోఁ బారసీకచక్రవర్తి క్షారుఁడు యుద్ధమునకు వచ్చెను. సర్కా రుత్తరువుప్రకారము దేశోచ్చాటనఁ జేయఁబడిన వారందఱు పట్టణమునకు వచ్చిరి. ఆరిస్టైడీసు సహావచ్చెను. అతఁడు, థైమిస్టాకిలీసు కలిసికొని, సఖ్యత జేసికొనిరి. ఒకఁడు దేహబలముచేత, మరియొకఁడు బుద్ధిబలము చేత,