పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆరిస్టైడీసు

179


మరుసటిసంవత్సర మతఁడు 'అర్కను' పేరుగల పెద్ద యుద్యోగములోఁ బ్రవేశించెను. అతఁడు సమవర్తి యని పేరు బొందెను. ధర్మముగ ప్రజలను బరిపాలించెను. పరమేశ్వరుఁడు సకలగుణసంపన్నుఁడు: అమర్త్యత్వము, సమవర్తనము, ప్రభుత్వము కలవాఁడు. వీనిలో మొదటిది మనకు లభింపదు; మిగిలిన రెండును బొందవచ్చును. ప్రభుత్వము దొరికిన, క్రిందుమీదుఁగానక, విఱ్ఱవీగి, లోకకుటుంబములోనివారితో వైరముబొంది, కంటకము పడుదుము. అన్నిటికంటె యెక్కుడైన సమవర్తనమును బొందము. రాజాధిరాజులు సహితము 'సింహబలుఁ'డని, 'దిగ్విజయుఁ'డని, 'నరకాంతకుఁ'డని మొదలగు ప్రభుత్వము, పరాక్రమమును దెలియఁజేయు బిరుదులను బొందగోరెదరు కాని, సమవర్తనమును గలిగియుండవలెసని యభిలషించరు. శాశ్వతమైనదానిని విడిచి, యశాశ్వతమైనదానిని బట్టుకొని పెనుగులాడుచున్నాము. ఆరిస్టైడీసు సమవర్తనము నవలంబించి గీర్తిబొందెను. అది దిగంతములు నిండెను. అందుకుఁదోడు, ప్రజారాజ్యమును బోఁగొట్టి, రాజచిహ్నము లేకున్నను అతఁ డేక రాజ్యాధిపత్యమును వహించినాఁడని యెంచి థెమిస్టాకిలీసు ప్రజలతో మొఱబెట్టెను. అందుపైని వారందఱు కంటగించి, యతనిని దేశోచ్చాటనఁ జేసిరి.

దేశోచ్చాటనమునకు పాత్రులగువారు నేరస్థులనే నిర్ధారణలేదు, శారీర స్నేహధనబలములు గలవాఁ డెవఁడైన ప్రజా