పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


యముగ నిందింపఁబడితిని; ఇప్పుడు, వారిని సైరించుటవలన, నేను మంచివాఁడనైతి"నని, యతఁడు ప్రజలతోఁ జెప్పెను. అతనిని వారు స్తోత్రముఁ జేసిరి.

ఈ కాలములోఁ బారసీకచక్రవర్తి 'డరయసు' గ్రీకులపైకి యుద్ధముకు భూమికాసైన్యములను బంపెను. అప్పుడు, మిలిటియాడీసు, ఆరిస్టైడీసు - వీ రిరువురి నథీనియనులు సేనాధిపతులుగ నియమించిరి. వంతుప్రకారము రోజుకొకరు సేనాధిపత్యమును వహించవలసియున్నను, తనవం తారిస్టైడీసుమిలిటియాడీసునకే యిచ్చివేసెను. "సేనాధిపత్యమును నేను బాగుగ వహించలేను. అతఁడు తగిన వాఁడుగనుక చూచుకొను”నని ఆరిస్టైడీసు చెప్పెను. తదనంతరము 'మరాథాను'వద్ద యుద్ధము జరిగెను. అందులోఁ బారసీకు లోడిపోయి, పడవల నెక్కి పరారు లయిరి. వా రాథెన్సుపట్టణమునకుఁ బోవుదు రను భయముచేత, నెనిమిది పటాలములను దీసికొని మిలిటియాడీసుపట్టణమునకుఁ బోయెను. యుద్ధములో దొరికిన ధనమును, శత్రువులను గాపాడుట కారిస్టైడీనుండిపోయెను. ఈ దొరికిన ధనమునకు విలువలేదు. అందులో నొక కాసైన నతఁ డపహరించ లేదు సరేకదా, పరులనైనఁ దీసికొన నియ్యలేదు. అప్పటికిని, గొంద ఱతనికిఁ దెలియకుండ కొంత సొమ్మును దస్కరించుచు వచ్చిరి. ఈ యుద్ధము క్రీ. పూ. 490 సం|| రములో జరిగెను.