పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెమిస్టాకిలీసు

169


పుకు” క్రీడలలో నతఁడు ధనమును కర్చు పెట్టుచుండెను. అతనిని డాంబికుఁడని ప్రజ లనుచుందురు.

"ఆ థెన్సుపట్టణములో నతఁడు పెద్దయుద్యోగమును సంపాదించెను. అతని శత్రువైన” ఆరిస్టైడీసు దేశోచ్చాటన నందెను. థెమిస్టాకిలీసు కోరిక నెర వేరెను. వ్యవహారములలో నతని నడ్డగించువారు లేరు. ఈ కాలములో పారసీకులు నావలతో బయలుదేరివచ్చిరి. సముద్రముమీఁద యుద్ధము జరగవలసె. గ్రీకులంద ఱేకీభవించిరి. వారిలో నథీనియనులే 'విశేషముగ నావలు గలవారు. సేనాధిపత్యమును మొదట' థెమిస్టాకిలీసు పుచ్చుకొనెను. కాని, తరువాత 'స్పార్టను'లలో నొకని కిచ్చివేసెను. ఘోరముగ నౌకా హవము జరిగెను. పారసీకులు పెద్దకేకలు, బొబ్బలు పెట్టుటయే గాని, క్రియశూన్యము. వీనికి గ్రీకులు భయపడుదురా, అందులో నథీనియనులు సముద్రముమీఁద నారి తేరినవారు. యుద్ధములో జయాపజయము లెవరివో తెలియకుండె. పారసీకచక్రవర్తి 'క్షారుఁడు' కొంత భూసెస్యమును దీసికొని గ్రీకుదేశముపైకి దండెత్తివచ్చెను. ఇటుల గ్రీకులు రెండువైపులనుండి యెదురుకొనఁబడిరి. పారసీకులు "తెర్మాపొలెయి" యను కనుమగుండ వచ్చినగాని, గ్రీసుదేశములోనికి రాలేరు. కనుమముఖద్వారమున 'లియాను దాసుఁ'డను సేనాధిపతి, 600 స్పార్టను సైనికులతో నిలిచి, పారశీకుల లక్షసైన్యము నెదిర్చెను. పారసీకుల శిరములు