పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


తమలో దాము దానిని బంచుకొనుట వాడుకకలదు. స్త్రీలు విశేషముగ నాభరణములను ధరించుచుండిరి. వెండి బంగారము నిలవచేయుటకు బదులు వానిని వ్యయపఱచి, నావలను కట్టిన, సముద్రముమీఁద పరదేశములతో వ్యాపారముఁజేసి లాభములను బొందుటకు సమర్థత కలుగుటయెగాక, స్వపర దేశీయులను లొంగదీసి, తమరౌన్నత్యమును బొందుటకుఁగూడ శక్తికలుగు నని 'అథీనియనుల'కు థైమిస్టాకిలీ సుపదేశించెను. అతని యుపదేశముప్రకారము, వారు వెండి బంగారములను గర్చు పెట్టి, నావలను కట్టిరి. వారి యోడవర్తకము సాగెను; లాభమువచ్చెను. వారికి సముద్రమనిన భయము లేకపోయెను, వారు మంచినావికు లైరి; నౌకాహవములో వారు శత్రువులనోడించిరి.

అతఁడు మహావైభవముతో బ్రదుకుచుండెను. అందుకుఁ దగిన ధనముగావలెను గనుక , నతఁడు గొన్ని నీచపుఁబనులను జేసెను. అధికారి యని ప్రజలు తెచ్చియిచ్చిన కానుకల నతఁ డమ్మివేయుచుండెను. ఈ కానుకలను బుచ్చుకొనుటలో నతఁ డారితేరెను. ఒకరి వస్తు వేదైన నతఁడు చూచిన, దానిని వారివద్దనుండి నయముననో భయముననో దెప్పించు కొనువఱ కతఁడు నిద్రించుటలేదు.

కులము తక్కువవాఁడు గనుక, అతఁడు పేరుపొందవలె నని గోరుచుండెను. వైణికులు, గాయకులు, నటులు నతని మాట కడుగుతీయలేదు. ప్రతిదినము పండుగులవలె "ఒలిం