పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెసియసు

161


వణ్యము జిక్కగఁ గారుచుండెను. అతఁడు కామినీహృదయభేదన నైపుణీకటక్షవీక్షణములతో నొప్పుచుండెను. అతని యందు దేహసంస్కారములకు మనోసంస్కారములు జోడింపఁ బడియుండెను.

అట్టి కుమారుని జూచి తల్లి కొంత మనోవ్యధను బొంది, “నాయనా, నీ తండ్రిగారు నీవు గర్భములోనున్నపుడె, నన్ను విడనాడి, ఆథెన్సునగరమునకుఁ బోయిరి. వా రక్కడిరాజులు. ఆ బండరాతికింద వా రేమో నీ నిమిత్తము కొన్ని వస్తువులు దాచియుంచిరి. నీవు వానిని ధరించి, వారియొద్దకుఁ బొమ్మ"ని యతనితోఁ జెప్పెను. రెండు మూఁడు వందలమంది కదిలించ లేని బండరాతి నతఁ డవలీల గదలించి, పైకిఁ ద్రోసి, లోపల బిలములోనున్న పాదరక్షలను చంద్రాయుధమును బట్టుకొని వచ్చి తల్లికిఁ గసపఱచెను. పాదరక్షలను దొడిగి, చంద్రాయుధమును ధరించి, యతఁడు తండ్రి యొద్దకుఁ బోవుటకు సన్నద్దుఁ డయ్యెను. మాతామహుఁ డందులకు సంతోషించి, నాటున గాక సముద్రముమీఁద బయలుదేరి వెళ్లవలసిన దని, యతనికి సలహాచెప్పెను. తాతగారి మాటలను చెవిని పెట్టక, నాటున బోవుట కే యతఁడు సిద్ధ మయ్యెను.

ఆకాలమున రాధారిమార్గములు, బాటలులేవు. అడవులు దాఁటుకొని మనుజులు ప్రయాణములు చేయుచుండిరి. మార్గములో దొంగలను తప్పించుకొని, దుష్టజంతువుల వాత