పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థెసియసు

థెసియసు, రోమ్యులసు, వీరిరువురు దేవాంశసంభూతులని చెప్పుదురు. వారి పుట్టుపూర్వోత్తరములు బాగుగ దెలియవు. ఇరువురు కానీనులు: మహావీరులు; దేహబలము, మనోబలముగలవారలు. మొదటివాఁడు 'ఆథెన్సు'నగరమును, రెండవవాఁడు 'రోము'నగరమును స్థాపించెను. ఉభయులు స్త్రీలను జెరబట్టుచుండిరి. తుదకు వారికి గృహకలతలు గలిగి బాధపడిరి. మొదట ప్రజలు వారి నెంత గౌరవించిరో, తుద కంత గర్హించిరి.

థెసియసుయొక్క పితృవంశముసంగతి బాగుగ తెలియదు; అతని మాతామహుఁడు 'ట్రాజినీ' పట్టణములోని రాజు. ఇతని కొక కూతురుమాత్రము గలదు.

ఆథెన్సునగరములోఁ గాపురము జేయుచున్న 'ఆజియసు' యను రాజు సంతానము లేక, సోదెవేయించి కనుగొనుటకు 'డెల్పి'గ్రామమునకుఁ బోయెను. నగరమునకుఁ బోవు వఱ కితఁడే స్త్రీముఖమును జూడగూడ దని సోదెచెప్పిరి. ఇతఁ డా మాట విని, తిన్నగా నగరమునకుఁ బోవక, ట్రాజినీపట్టణము వచ్చి, 'పిథియసు'గృహములో బసచేసెను; ప్రసంగ

159