పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూమా

157


బిరుసెక్కెను. దయాదాక్షిణ్యములు వెతకిచూచినను వారిలోఁ గాన రావు. వారి పొదలిక కత్తిపదును. వీరి నెటుల మచ్చిక చేయుట? ఇనుము కఠినమైనది. అగ్ని స్పర్శ చేత మృదువు. కాదా? వీరి మనోదేహకాఠిన్యములను బోగొట్టుటకు వేరు. మార్గములు దోఁచక, దేవతారాధన లని, బలు లని, దేవోత్సవము లనెడు మొదలగు దేవతాక్రియలలో వారి నతఁడు ప్రవేశ పెట్టెను. తనకు దేవి ప్రత్యక్ష మగునని వారితో నతఁడు చెప్పుచుండెను. దేవాలయముల నతఁడు ప్రతిష్ఠఁజేసెను. నిర్గుణబ్రహ్మమునకు ప్రతిమరూపము నిచ్చి పూజించుట కిష్టము లేక, విగ్రహము లేకయే వారు దేవాలయములలో దేవతారాధనఁ జేయుచుండిరి. కర్మకాండ నతఁడు బహుళము చేసెను. అర్చకులు మెండయిరి. వారిమీఁదఁ బెద్ద యర్చకుఁడొకఁడు నియోగించఁబడెను. శకునజ్ఞులు ప్రబలిరి. బలులిచ్చుటకుఁ దగిన తంత్రములు బలిసెను. ఒకచోట నవిచ్చిన్నాగ్ని హోత్ర ముంచఁబడెను; దానిని సంరక్షించుటకుఁ గొందఱు సతీతరుణు లొప్పుకొనిరి. దేవతార్చన విధానములు పూర్వముకంటె రెండింతలు పొడవయ్యెను. వీనినన్నియు రాజు స్వయముగఁ బరిశీలించి, ప్రతిదినము వానిని జరిపించు చుండెను.

అతఁడు రాజనగ రొకటి కట్టించెను; పధకశుద్ధి జేయించెను. అతని కాలములో యుద్ధములు లేవు. దుర్మరణ మను