పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


సింహాసన మెక్కవలెను. దేవాంశయుండినగాని రాజుకాఁడు. దుర్లభమైన యట్టి పదవి సంప్రాప్త మైనపుడు, నీవు దానిని తిరస్కరించఁగూడదు. పురుషార్థములను యథావిధిగ నడపగలవు. శాశ్వతమైన సంతానములు నీకుఁ జేకూరును. 'యథా రాజా తథా ప్రజాః' అనునటుల నీవు సన్మార్గము నవలంబించి నందున, నీ ప్రజలు నిన్ననుసరించి బ్రతుకుత్రోవఁ గనఁగలరు. రాజుకు జనులే కుటుంబము. ప్రజలకు స్వాస్థ్యము గలుగ జేయుటకన్న హెచ్చు పుణ్యముండునా" యని హితవచనములు చెప్పి కుమారుని వంచెను. అంతలో రాయబారులు వచ్చిరి. మారుమాట చెప్పక, 'నూమా' వారితోఁ గలిసి నగరమునకుఁబోయెను. మార్గములోఁ బ్రజ లతనిని తారసిల్లి, పరమానందభరితులైరి, సెనేటుసభవారు మొదలగు సామంతులు వెంటనంటియుండ, నగరములో నతఁడు ప్రవేశించెను. ఊరేగింపు ముగిసిన తరువాత, నతనిని రాజభవనములోనికిఁ దీసికొని వెళ్లి, వా రతనిని రాజచిహ్నములతో నలంకరించఁ జూచిరి. అతఁడు వారి నప్పటికి వారించి, సుముహూర్తంబున దేవియాజ్ఞ గైకొని, దేవతార్చనములు చేసి, బలు లిచ్చి, సింహాసన మధిష్టించి పట్టభద్రుండయ్యెను.

అతఁడు రాజ్యమునకు వచ్చుసరికి, రోమకులు ముష్కరులు, తెల్ల వారి లేచినది మొదలు పోరేగాని మరియొకటి లేదు. పోరాటములోని పాటు పోటులవలన వారి శరీరము పూటుపడి