పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


"కాలంబుతఱి యెఱింగి' జీవింపు మని బుద్ధి జెప్పిపోయె”నని రాజు సమాధానముఁ జెప్పెను. ఇతనికంటె బుద్ధిమంతుఁడు గనుక, చక్రవర్తి యతనికి మరణశిక్షను నాపివేసి, యావజ్జీవము రాజును బోషించెను. సోలను యొక్క హితోపదేశ మిటుల నిరవురిని మోక్షాయత్తచిత్తులుగఁ జేసెను.

సోలను దేశములో లేనిసమయమున 'అథీనియనుల' వ్యవహారములు చిందరవందరగ నుండెను. అతఁడు స్వదేశమునకు వచ్చినవెంటనె, ప్రజలు మిగుల సంతసించి, వారి వ్యవహారములను జక్క పెట్టవలసిన దని కోరిరి. అతఁడు వృద్దు; దేహపటిమ తగ్గినవాఁడు. అందుచేత స్వయముగ విషయములను సంస్కరించలేక , సర్కా రుద్యోగస్థులకు మంచిమార్గముఁ జూపుట కతఁ డుపగమించెను. కాని, కొందఱు మొదట నతని మాటలకుఁ బెడచెవి నొగ్గి, యతనిని జంపించుటకు సమకట్టిరి. గడితేరినవాఁడు గాన, వారి బెదరింపులకు లక్ష్యము చేయక, చెడుమార్గమును వారు వదలునటు లతఁడు చేసెను. ఇటుల సర్వజన శ్లాఘనీయంబైన జీవిత కాలమును గడిపి, యతఁడు వరమపదముఁ బొందెను.