పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోలను

151


కంటె హెచ్చు సౌఖ్యము ననుభవించువానిని జూచితివా?" యని రా జతని నడిగెను. "చూచితిని. వాఁడుమా 'ఆథెన్సు'లోఁ గాపురము చేసెను. భాగ్యభోగ్యములు లేకపోయినను, సంతానవంతుఁడై , యన్నవస్త్రాదులకు లోపములేకుండ సుఖముగ వాఁడు జీవించె”నని యతఁడు ప్రతివచన మిచ్చెను. ఆ రాజునకంటె సుఖముగ జీవించువారు పలువురు ప్రపంచములోఁగల రని యతఁడు రాజునకుఁ దెలియఁ జేసెను. "ఓ రాజా, మేము ప్రజారాజ్యములోనివారము. కొఱతలేకుండ మాకు దైవ మన్నోదకము లిచ్చియున్నాఁడు. మేము విషయేచ్ఛలను గోరువారము కాము. 'అంగనాపుత్ర గేహారామవిత్తాది సంసారసుఖముల దగిలి వర్తించము'. ఇవి క్షణభంగురము”లని బోధపఱచి యతఁడు లేచిపోయెను.

చంచలలక్ష్మి యని సార్థక నామమె. మఱి కొన్నిరోజులకు పారసీకచక్రవర్తి 'కైరసు' దండెత్తిపోయి, 'క్రీససును' యుద్ధములోఁ బట్టుకొని, మరణశిక్ష విధించి, యితనిని దగుల పెట్టవలసిన దని సేవకుల కాజ్ఞచేసెను, కాష్టమువద్ద నిలువఁబడి “ఓ సోలనా, ఓ సోలనా” యని రాజు మొఱఁ బెట్టెను. ఈ సంగతి విని, చక్రవర్తి పరుగెత్తుకొని వచ్చి, "ఓరాజా, నీ వెవరి పేరును తలఁపక, సోలనును తలఁచితి వేమి? అతఁ డెవ”రని రాజు నడిగెను. “అతఁడు గ్రీకులలోఁ బ్రాజ్ఞుఁడు. అతఁడు నా సంపత్తును జూచి, దానిని ప్రేమించవల దని హితోపదేశముఁ జేసి,