పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోలను

149


మనుజుఁ డొక వ్యాపారమును నేర్చుకొనియుండవలెను; సోమరిగ నున్నవాఁడు కఠినశిక్షను బొందుచుండెను.

నగరమునకు సమీపమున సరస్సులుగాని జీవనదులుగాని లేవు. నూతులలోని నీరును వారు వాడుకొనుచుండిరి. వారు నూతులు త్రవ్వించుకొనవచ్చును; మొక్కలు పాతించ వచ్చును. పండించిన పంటలనుగాని, భూమిలో దొరికిన వస్తువులనుగాని, వారు పై దేశములకుఁ బంపకూడ దని యతఁడు నిర్ణయముఁ జేసెను. సరుకుల నెగుమతిచేసినవారు కఠినశిక్షను బొందుచుండిరి. ప్రజారాజ్యములోనివారు గనుక దేశమునకు క్షేమము శుభము నిచ్చు కార్యములు జరగినపుడు, సర్కారువారు విందులు చేయించుట గలదు. జరిగినపుడెల్ల విందులకుఁ బోయినవాఁడు తిండిపోతని వానిని శిక్షించుట గలదు; పిలిచినపు డొక పర్యాయమైన వెళ్లనివాఁడు శిక్షకుఁ బాత్రుండు,

సోలను చట్టములు నూఱుసంనత్సరములవఱ కమలులో నుండెను. అతనిని జూచుటకుఁ బ్రతిరోజున గొప్పవారు బోవుచుండిరి; కొంద ఱతనిని శ్లాఘించిరి; కొన్ని చట్టములలో సవరణఁ జేసిన బాగుగ నుండునని కొందఱు సలహా యిచ్చిరి; మంచివికా వని తోఁచిన వానిని రద్దుచేయవలసిన దని మఱి కొందఱు చెప్పిరి, ఎంత గొప్పకార్యమైనను సర్వజనశ్లాఘనీయముగ నుండదుగదా? అందఱను మెప్పించుట గష్టము. "ఒకరికి పులు