పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


అందుకుఁ దగిన సమాధానము జెప్పఁగలరా? అటులనె, బ్రతికి యున్నవా రొకరి నొకరు సభలలోను, దేవాలయములలోను, క్రీడలలోను, న్యాయసభలలోను నిందించుకొనరాదు. ఇంతకు పూర్వము వారు మరణశాసనము వ్రాసి వారి యాస్తులను పంచిపెట్టుట కధికారము లేదు; అతఁడు వారి కధికారము కలుగఁజేసెను. స్థిరాస్తిని వారు బంధువుల కియ్యవచ్చును; సంతానము లేనపుడు స్నేహితులకుఁ గొంత యిచ్చుట గలదు. ఇష్టానుసారము వారు మరణ శాసనమును వ్రాయఁగూడదు. ప్రయాణమైపోవునపుడు, కష్టములు వచ్చినపుడు, బలు లిచ్చు నపుడు, స్త్రీ లెటుల ప్రవర్తింపవలయునో-వీనికి గొన్ని నిబంధనల నతఁ డేర్పాటుచేసెను. వారు ప్రయాణమై పోవునపుడు, బండికిముందు దివిటీ లుంచుకొనవలెను.

ఆథెన్సుపట్టణములోఁ బ్రాణధనములకు స్వాస్థ్యముండెను. అందుచేతనే, దేశ దేశములనుండి ప్రజలు వచ్చి, యక్కడ గాపురముండిరి. అయినను, భూములు సాగుబడి అగుటలేదు; మనుజులు దరిద్రులుగ నుండిరి. వీనికిఁ దోడు, వర్తకవ్యాపారములు నిలిచిపోయెను. కనుక, పొట్టపోషించుకొనుటకుఁ దగిన వ్యాపారములోఁ గుమారుని తండ్రి ప్రవేశ పెట్టనిపక్షమున, వృద్దాప్యములోఁ దండ్రిని గుమారుఁడు పోషించ నవసరము లేదని, యతఁ డొక నిబంధనఁ జేసెను. ప్రతి