పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోలను

సోలను మంచివంశములోఁ బుట్టినవాడు. . అతని తండ్రి ధర్మాత్ముఁడు; గొప్ప దాత. అతని మాతృవంశమువారు గూడ గొప్పవారనియే తెలియుచున్నది. దేహియని వచ్చిన వానిని లేదనిచెప్పి తండ్రి పొమ్మనలేదు. అందుచేత నతనికి పిత్రార్జితము విశేషముగ లేదు. బ్రతికిచెడినవాఁడు గనుక, పూర్వము తమవలన నుపకారముఁ బొందినవారి సంరక్షణలో నుండుట కష్ట మని యెంచి, యతఁడు పరదేశమునకుఁ బోయి, వర్తకవ్యాపారములలోఁ దిగెను. దేశసంచారముఁ జేసి, మన స్సంస్కారము నతఁడు బొందెను. "వయస్సు ముదిరినకొలఁది నా బుద్ధి వికసించుచుండె”నని యతఁడు చెప్పెను.

ఆ కాలమున నేవ్యాపారమును ప్రజలు క్షూణతగఁ జూచుటలేదు; వానిలో వర్తకవ్యాపారమును విశేషము మన్నించిరి. వర్తకమూలముననేకదా, పరదేశీయులతో సాంగత్యము, వారితో నిచ్చిపుచ్చుకొనుట, రాకపోకలు జరుగుచుండును? దేశీయులకు లావణ్యము, నడవడిలో సరళత - నాగరికము దేనిమూలమున వచ్చును? ఎందఱు వర్తకులు శంకుస్థాపనఁజేసి, వారి పేరున పట్టణములు గట్టించిరి!

143