పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గేయసు - గ్రాకసు

141


ములోఁ బ్రవేశించకూడదు; సర్కారువా రేర్పఱచిన ధర ప్రకారము వర్తకులు సామగ్రుల నమ్మవలెనుగాని, హెచ్చు వెల కమ్మ గూడదు; ఈ నిబంధనల నతఁడు కల్పించెను.

ఎప్పుడు ప్రజలయెదుట ప్రసంగించిన, నతఁడు తన పుట్టు పూర్వోత్తరములను జెప్పుచుండెను. ముచ్చటించినపుడెల్ల, తన యన్న దుర్మరణముసంగతి యెత్తుచుండును; అప్పుడు వారు విచారించుచుండిరి. తన వాచాలత్వముచేత వారి నతఁడు పరవశులను జేయుచుండెను. కొందఱి నతఁడు నూతన సీమలకుఁ బంపెను, ప్రయాణములు సుళు వగుట కతఁడు బాటలు వేయింపిం చెను; నదులమీఁద వంతెనలను గట్టించెను; ధాన్యము నిలువఁ జేయుటకు కొట్లు కట్టించెను. అతని వెంట పండితులు, రణవీరులు, పనివాండ్రు, రాయబారులు: పోవుచుండిరి. యథావిధిగ నందఱిని మర్యాదఁజేసి, వారితో నతఁడు మాటలాడుచుండెను. ఎంత పనిచేసినను, శ్రమ లేదు; ఏపనినైన నతివేగముగ గ్రహించును; దానికి తగినటుల ప్రత్యుత్తరములను వ్రాయును. అతఁడు రెండవ పర్యాయము ప్రజానాయకోద్యోగములో నియోగింపఁబడెను.

తదనంతర మతఁడు 'ఆఫ్రికా'దేశమునకుఁ బోయి యక్కడ గొంతకాలముండి యా దేశమునకు స్వాస్థ్యమ దెచ్చెను. అతఁడు నగరములో లేని కాలములో నతని చట్టములను రద్దుపఱుచుటకుఁ గొందఱు సామంతులు బ్రయత్నించిరి