పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


అతఁడు ప్రతి గ్రామమునకుఁ బోయి, తినుబడి సామగ్రులను వస్త్రములను, ధర్మార్థముగఁ గొన్ని, వెలయిచ్చి కొన్నవి కొన్ని దెచ్చి వారికి పంచిపెట్టెను. సైనికు లతనిని శ్లాఘించిరి.

అతఁడు ప్రజానాయకోద్యోగములోఁ బ్రవేశించెను; ప్రవేశించినది మొదలు వారి విషయమై శ్రమపడుచుండెను. వారి క్షేమము నాలోచించి యతఁడు చేసిన కొన్ని చట్టముల నిందు బొందుపఱచుచున్నారము:--

(1) "ఏ న్యాయాధికారి నైన ప్రజలు పనిలోనుండి తొలఁగించినపుడు, వాఁడు తిరి గీ యుద్యోగములోఁ బ్రవేశించుట కర్హుఁడు కాఁడు. (2) ఏ న్యాయాధికారి యైన యే మనుజుని విచారణచేయక దేశోచ్చాటనకుఁ దీర్పు చెప్పినయెడల, వాని నేరము న్యాయసభలో విమర్శింపఁబడునటులఁ జేయు బాధ్యత ప్రజలకు నుండవలెను”. సెనేటుసభవారి ప్రభ తగ్గించి, ప్రజల మాట ప్రబలమగునటుల, నతఁడు మరికొన్ని చట్టములను చేసెను, నూతనసీమల నేవిధమున నాక్రమించు కొనవలయునో, వాని నెటుల పంచుకొనవలయునో, వీనివిషయమైనవి కొన్ని చట్టములు - యుద్ధమునకుఁ బోయినపుడు, కావలసిన దుస్తులు తినుబడి పదార్థములను సైనికులే తెచ్చుకొనుట కలదు. అతని చట్టముప్రకారము సర్కారువారు సైనికుల కా వస్తువులను జతపెట్టవలసివచ్చెను. పదియేడు సంవత్సరములు ప్రాయము వచ్చు వఱ కే మనుజుఁడు సైన్య