పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టైబీరియసు - గ్రాకసు

135


కాని, యామె యందుల కియ్యకొనలేదు. ఆమె సంతాన మంతయు నశించి, యిరువురు కుమారులు, నొక కూఁతురును మాత్రమే యామెకు దక్కిరి. ఈ కుమారులే వీరిరువురు. వీరి జీవితచరిత్రములనే మనము వినఁబోవుచున్నాము.

అన్నదమ్ము లిరువురు మంచి గరిడీలు; రెండవవాఁడు . స్వారిచేయుటలో ఘనుఁడు. దాతృత్వము, వక్తృత్వము, ఔదార్యము, మితభోజనము, ధైర్య స్థైర్యములలో వారు సమానులే. రాజకీయ వ్యవహారములలో మాత్రము వారు భిన్నాభిప్రాయులు. పెద్దవాఁడు శాంతుఁడు; రెండవవాఁడు దుడుకు. స్థానము వదలక పెద్దవాఁ డుపన్యసించును; తమ్ముఁడు నాట్యముఁ జేయుచు ప్రసంగించును. జ్యేష్ఠుని ప్రసంగములు నిర్మలమై, విరివిగనుండును; కనిష్ఠునివి గంభీరమై మనస్సును గరగించును. అటులనే, వారికి భోజనములోఁగూడ ద్వైతమె, ఒక్కఁడు మితభుక్కు; ఇతర రోమకులతోఁ బోల్చిన రెండవవాఁడు యుక్తాహారమును బుచ్చుకొనువాఁడైనను, పెద్దవానికంటె భోగియని చెప్పవచ్చును. ఒకఁడు ముందు వెనుక లాలోచించి కార్యములను నెమ్మదిగఁ జేయును; రెండవవాఁడు తొందరపాటున మనస్సు కట్టలేక, దాని వ్యాపారములకు లోఁబడి, వ్యవహారములలో షడ్రసములను జూపుచుండెను. ఏకోదరు లిట్టి భిన్నవ్యాపారములు గలవారు.

మొదటివాఁడు చిన్నవానికంటెఁ దొమ్మిది సంవత్సర