పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైకర్గసు

127


నేదియేదో సభికులు గుర్తెఱుగలేకయుండిరి. అవి షడ్రసములు జిలుకుచుండెను. అట్టివాఁడు తనదేశములో నుండిన, ప్రజలకు మేలుకలుగు నని యెంచి, లైకర్గసు నతనిని స్వదేశమునకుఁ బంపెను. థాలీసు స్పార్టనులను గొంత మార్గములోనికిఁ దెచ్చినపైని, లైకర్గసు వారిని ససరించుటకు వీలుపడెను.

ఆ ద్వీపమునుండి బయలుదేరి, 'ఆసియామైనరు'. 'ఈజిప్టు' మొదలగు దేశములకుఁ బోయి, యా యా దేశీయుల వేషభాషలను గుఱ్తెఱిఁగి, వారివారి రాజ్యతంత్రములలోని లోగుట్టులను గ్రహించుటలో నతఁడు గాలము గడుపుచుండెను.

ఇఁక స్వదేశముసంగతి యేమియు బాగు లేదు. రాజు బాలుఁడు; రాజ్యతంత్రములను నేర్చుకొనుచుండెను; రాజ్య సూత్రములను బరులు వహించిరి. రాజుండినను, దేశ మరాజకముగ నుండెను. ప్రజలు ఘోష పెట్టుచుండిరి; రాజును, వాని సంరక్షుకులను నిష్ఠురమాడుచుండిరి. అప్పుడు వారంద ఱేకీభవించి, 'లైకర్గసు'కు వర్తమానముఁ బంపి, యతనినిఁ దెప్పించిరి. అతఁడు వచ్చి, ప్రజలసమ్మతి పైని, రాజ్యతంత్రములను వారి కనుకూలముగ మార్చెను. అవతరించిన మార్పులలో 'సెనేటు,యను సామంతుల సభయొకటి. రాజు, ప్రజలు - ఒకరి నొకరు స్వబలముచేత మట్టి వేయకుండునటుల వారిని సమశాంతముఁ జేయుటయే, యీ సభవారిపని; ఉభ