పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


వచ్చి రాజుతోఁ జెప్పిరి. సుపుత్రిక జననమందిన, దానిని దాసీల కప్పగించవలసినదనియు, సుపుత్రుఁడు కలిగిన దానిని తనయొద్దకుఁ దీసికొని రావలసిన దనియు వారి కతఁ డాజ్ఞ చేసెను. ఆమెకు పుత్రుఁడు కలిగెను. భృత్యు లా శిశువును రాజువద్దకుఁ దెచ్చిరి. ఆ శిశువే దేశమునకు రాజని ప్రకటన చేయింపించి, సంరక్షకుఁడను బిరుదుతో నతఁడు రాజ్యముఁ జేయుచుండెను, ఆ శిశువునకు 'చారులాసుఁ' డని నామకరణముఁ జేసిరి.

ఈ బాలుని జంపి, రాజ్యము సపహరించవలెనని యతఁడు కోరలేదు; అట్టికోరిక స్వప్నములోనైనను కలుగ లేదు. బాలుని మేనమామ 'లియానిదాసుఁడు', యతని న్యాయపరిపాలనమున కోర్వలేక, యతఁడు బాలుని జంప సమకట్టు చుండెనని, నిందారోపణఁజేసెను. అందు కతఁడు రోసి, బాలునికి వయస్సు వచ్చువఱకు దేశాటసఁ జేయుటకు నిశ్చయించి, రాజ్యసూత్రములను విడిచి, బయలు దేరిపోయెను.

అతఁడు మొదట 'క్రీటు' దీవికిఁ బోయెను. అక్కడి రాజ్యతంత్రముల నిర్మాణమును గనిపెట్టి, 'థాలీసు^' అను వైణికునితో స్నేహముఁజేసి, వానిని తనదేశమునకుఁ గాపురముబోయి యుండు మని చెప్పెను. థాలీసు వీణమీటించి కంఠమెత్తుసరికి, సభికులు పరవశు లగుచుండిరి. ఇతని కంఠస్వరము, వీణస్వరములు రెండును సమ్మిళితములగుట చేత,