పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైకర్గసు

ధర్మశాస్త్రజ్ఞుఁడైన 'లైకర్గసు'ను గురించి తెలిసిన సంగతులన్నియు వివాదాస్పదము లయినవి. అతఁ డెప్పుడు పుట్టెనో, యెన్నడు గిట్టెనో; యే యే దేశములలోఁ దిరిగెనో; ధర్మశాస్త్రము నెటుల సమకూర్చి, రాజ్యతంత్రము లెటుల నిర్మించెనో ఈ యంశములు పలువురు పలువిధముల వ్రాసిరి. ఇతఁడు గ్రీసు ద్వీపకల్పమునకు దక్షిణముననున్న 'స్పార్టా' యను మండలములోనివాఁడు. కులీనుఁడు; క్షత్రియుఁడు;. భేతాళుని (Hercules) వంశములోనివాఁడు.

తండ్రి సంతానములో నతఁడు రెండవవాఁడు. అతని జ్యేష్టభ్రాత కొంతకాలము రాజ్యముచేసి స్వర్గస్థుఁడయ్యెను. ఇతని భార్య నెలదప్పియుండెను. లైకర్గసు తక్తు నెక్కెను. వదినెగా రతనియందలి మక్కువచేత గర్భస్రావము చేసికొనియెదనని చెప్ప, నతఁ డందుల కియ్యకొనక, పుట్టినశిశువును చంపివేయవచ్చునని యామెకు సమాధానము పంపెనఁట. అతని మాట లామె నమ్ముకొనెను. ఆమె గర్భము దినదిన ప్రవర్థమానమై, నానాఁటికిఁ బ్రసవదినము లామెకు సంప్రాప్తమయ్యెను. ఆమె ప్రసవ వేదన పడుచున్నదని భృత్యులు

125