పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కు-ఆంతోని

119


గాలము గడుపుచుండెను. అతఁడు తన కూఁతురును 'అగస్టసు' కిచ్చి వివాహముఁ జేసెను. ఈ సంగతులు చూచి ప్రజలు రోసిరి. వారు సైన్యములతో వీరుమువ్విరిమీఁదఁ దిరుగఁబడిరి. ప్రజల సేనాధిపతులు 'బ్రూటసు', 'కాసియసు' మొదలగు వారు రణములో హతులైరి.

'అగస్టసు'ను రోమునగరములో నుంచివేసి, 'ఆంతొని' కప్పములను బుచ్చుకొనుటకు గ్రీసు మొదలగు దేశములకుఁ బోయెను. ఇక్కడ రోములో 'అగస్టసు' పడుచున్న బాధలను గనిపెట్టక, విశేషముగ ధనమును బుచ్చుకొని, దాని నతఁడు దుర్వినియోగముఁ జేయుచుండెను. 'కాకులను గొట్టి, గద్దలకు వేయుట' యనునటుల, ప్రజలను బీడించి రాఁబట్టిన ధనము నతఁడు వేశ్యలకు, భట్రాజులకు నిచ్చుచుండెను. అతఁడు చక్కనివాఁడని తెలిసి, రాజపత్నులు, సుందరాంగులు మహా విభవముతో నతనిని జూడవచ్చిరి. ఆ వచ్చినవారిలో 'ఈజిప్టు' రాణి 'క్లియోపాత్రా'కూడ నుండెను. ఈమె లంపట మతనికి తగులుకొనెను. ఆమె వలలోఁబడి, దివారాత్రము లతఁడు గానరాకుండెను.

'జూలియసుసీౙరు', 'పాంపేయుఁడు'...... వీరి కాలములో నామె చిన్నది. ఇప్పటికామెకు యుక్తవయస్సువచ్చెను. ఆమె రెండవ రతీ దేవివలె నుండెను. ఆమెకు నాలుగైదు భాషలలోఁ బ్రవేశము గలదు; సరసముగ మాటలాడునది. మహావైభవ