పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


ప్రాంతములకు వచ్చెను. సేనాధిపతి 'లెపిడస్సు' సైన్యముతో నక్కడ విడిదిచేసియుండెను. అతనిని తనపక్ష మవలంబించ మని ఆంతొని వర్తమానముఁ బంపెను. అతఁ డందులకు సమ్మతించలేదు; సైనికు లా మాటవిని, వెంటనె తిరుగుబాటుచేసి, వారంద ఱొక్కుమ్మడి 'ఆంతొని'ని సేనానిగఁ బ్రకటనఁ జేసిరి. అతఁడు 'లెపిడస్సు'ను మర్యాదగఁ జూచి 'ఉపసేనాని'గ నియోగించెను. పదివేల రౌతులకును పదునేడు దళములకును నతఁడు సేనాధిపతియయ్యెను. 'ఫ్రెంచి'దేశమును గాపాడుట కతఁ డాఱు దళముల నక్కడ నుంచి వేసెను.

'శిశిరో' ప్రజారాజ్యమును నిలబెట్టవలెనని కోరుచుండెను; 'అగస్టసు' అందుకు సమ్మతించలేదు. అందుచేత, నితఁడు 'ఆంతొని'పక్షము వచ్చిచేరెను. 'అగస్టసు', ఆంతొని', 'లెపిడస్సు' - వీరు మువ్వురు 'రోము' రాజ్యమును మూఁడు సమభాగములుగఁ బంచుకొనుటకు సమకట్టి, యొడంబడికఁ జేసికొనిరి. మూఁడువందలమంది శత్రువులను వారు పరలోకమునకుఁ బంపిరి. 'శిశిరో'కూడ దుర్మరణము నొందవలసి వచ్చెను.

ఉచ్చపదవి వచ్చినతోడనె, 'ఆంతొని' యధాప్రకారము విషయాసక్తుఁడై తిరుగుచుండెను. 'ఘనుఁడు పొంపేయు'ని గృహములో నతఁ డుండెను; ప్రజల కష్ట సుఖములు వినుట లేదు; అహోరాత్రములు వారాంగనలతోను, తుచ్ఛులతోఁ