పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు-బ్రూటసు

113


వేఁడెను. వారిలో నొకఁడు కత్తియెత్త, దానిమీఁదఁబడి యతఁడు ప్రాణములు విడిచెను. సేవకు లాత్మహత్యఁ జేసికొనిరి. ఈ యుద్ధము క్రీ. పూ. సం|| 42 రములో జరిగెను. భర్త మరణము విని, యతని భార్య దుర్మరణము దెచ్చుకొనెను.

అతఁడు గ్రంథపఠనకుఁ దగినవాఁడుగాని, సర్కారు పనికిఁ దగినవాఁడుకాఁడు; ప్రజారాజ్యమును నిలబెట్టుటకు పాటుపడెను; స్వదేశాభిమాని యని పేరొందెను. ఆ కాలములో నతఁడు మంచినడవడికలవాఁడు; చదివిన చదువుల నతఁ డభ్యాసములోనికి దీసికొని రానందున, నవి నిష్ప్రయోజనములయ్యెను. మంచి జ్ఞాపకశక్తి గలవాఁడు. ప్రజానాయకుఁ డగుటకుఁ దగిన త్రిశక్తు లతనికి లేవు. అందుచేత, నతఁడు మాటుపడెను.