పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు-బ్రూటసు

111

తదుపరి సీౙరుయొక్క దినవారములు వచ్చెను. అతనికి నపరకార్యములఁ జేయుట కతని స్నేహితుఁడు 'ఆంతోని' యారంభించెను. శవమును రుద్రభూమికిఁ దీసికొని పోవుటకు ముందు, మరణము నొందినవాని బంధువుఁ డొకఁడు ప్రేతోపన్యా స మొకటిసేయుట, రోమకులలో వాడుక కలదు. మరుచటిదినము 'ఆంతోని' ప్రజలయెదుట ప్రేతోపన్యాసము నిచ్చెను. చనిపోవుటకు ముందు, సీౙరు మరణశాసన (విల్లు) మొకటి వ్రాసి, దానిలోఁ బ్రతి రోమకునకు సుమారు రు 50 లిచ్చి, నగరమునకుఁ బైనున్న యుద్యానవనములు తోఁటలు మొదలగువానిని ప్రజలు వాడుకొనవలసినదని, శాసించెను. ఈ శాసనమును 'ఆంతోని' చదివి వారికి వినిపించెను. అదివఱకు సీౙరు మరణమునకు విచారించని వారంద ఱుద్రేకించి, కుట్రదారులను సంహరించుటకు సిద్ధపడిరి. సీౙరుకు తగిలిన గాయముల నతఁడు వారికిఁ జూపించెను. వారు వానిని జూచి విశేషముగ కోపించి, బల్లలు కుర్చీలు మొదలగువానిని తగులబెట్టి, యా కొరకంచులతోఁ గుట్రదారుల గృహములను దగులబెట్టుటకుఁ బోయిరి. ఈ సంగతి వారు విని గృహములు విడిచిపోయిరి. బ్రూటసు లేచి పారి పోయెను.

అనంతరము సీజేరుయొక్క మేనల్లుఁడు 'అగస్టసు-సీౙరు' నగరమునకు వచ్చెను. ఇతఁడు 'ఆంతోని'తోఁగూడి, 'లెపిడసు'