పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు-బ్రూటసు

109


రోమునగరములోని యుద్యోగము శ్రేష్ఠము. అందుచేత నా పనికి, బ్రూటసు, ఇతని బావమరిది 'కాసియసు' వీ రిరువురు దరఖాస్తుఁ జేసిరి. వారిరువురిలో బ్రూటసు నా పనిలో సీౙరు నియోగించెను. వీ రిరుగురితో సఖ్యతగ నుండవలెనని సీౙరుయొక్క యభిప్రాయము. ఇతఁడు సమకూర్చుచున్న యేకచ్ఛత్రాధిపత్యమునకు వీరుమాత్ర మిష్టపడలేదు. మరియొక యుద్యోగమిచ్చినను, 'కాసియసు' లోలోన ఘూర్ణిల్లుచుండెను. బావమరదుల కెప్పుడును వైరమె. బావమరిది చొరవరి, తొందరపాటుగలవాఁ డని యతనికి కోపము.

బ్రూటసు 'ప్రేటరు'గ నుండుకాలములో, "ప్రజాపీడకుల నెఱుంగుము. ఎఱుంగకపోయిన, నీవు బ్రూటసువు కావు” అని వ్రాయఁబడిన కాగితములచేత నతని న్యాయపీఠ మలంకరించఁబడియుండెను. అంతలో సీౙరును జంపుటకు, కాసియసు మొదలగునారు సమకట్టి, కొంచెము పేరుగలవాఁడు కుట్రకులకు నాయకుఁడగ నుండిన సలక్షణముగ నుండు నని యెంచి, బ్రూటసును దమలోఁ జేర్చుకొనుట కాలోచించిరి. ముందుగ నతని భావము గనుగొని, వా రతనిని గలుపుకొనిరి. నాఁడుమొద లతఁడు స్వాస్థ్యము గోలుపోయి హాయిగ నిద్రించుటలేదు; అతని గుండెలు బరువెక్కెను; నిదురలోఁ ద్రుళ్లిపడి లేచుట సహజమాయెను; కళంక రహితునకు కళంకము తగిలె. ముఖముఁజూచిన మీగాళ్లవాపు బయల్పడు నను లోకోక్తి