పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


దగినంత పాండిత్య మతఁడు సంపాదించెను. ముక్తసరిగ వ్రాయుటయు, ప్రసంగించుటయు నతని వాడుక.

ఈ కాలములోనే, రోమునగరమును, రాజ్యమును స్వాధీనపఱుచుకొనుటకు, సీౙరు, పాంపేయుఁడు ప్రతికక్ష వహించి పోరాడుచుండిరి. తన తండ్రిని జంపినవాఁడని కార్పణ్యము వహించక, పాంపేయునిపక్షమును బ్రూట నవలంబించెను. శతృకక్షలోనివాఁడైనను, సీౙ రతనిని ప్రేమించెను. అనంతరము, సీౙరు, పాంపేయుఁడు పోరాడిరి. పోరాటములోఁ బాంపేయుఁ డోడిపోయెను. బ్రూటసు వచ్చి సీౙరుపక్షములోఁ జేరెను.

అతఁడు న్యాయమైన పనులకే సమకట్టును; సమకట్టిన వానిని తుదముట్టించును; తుదముట్టినవానిలో జయమే గాని యపజయము లేదు. ఒక పని, న్యాయము గాని యన్యాయము గాని, చేయుమని పలుమా రొకరు చెప్పుటచేత, అతని మనస్సొక్కొకవేళ తిరుగును గాని, యతఁ డటుల సాధారణముగ మనస్సును తిరుగనియ్య లేదు. అతఁడు నిష్కర్షగ వ్యవహారములను జరిపెను. కొన్ని పరగణాలలో సర్కారుద్యోగస్థులు ప్రజలను బీడించి సొమ్ము నపహరించుట గలదు. అతఁ డేపరగణాలలో సర్కారుపనిఁ జేసెనో, యక్కడివారందఱు సుఖముగ జీవించి, యతనిని బొగడిరి. అతనికి ధనదాహము లేదు.

'ప్రేటరు'ద్యోగము లనేకములు గలవు. అందులో