పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు-బ్రూటసు

మార్కసు-బ్రూటసుయొక్క పూర్వికుఁడు 'రోము' నగరములోఁ బెద్ద యుద్యోగముఁ జేసెను. ఇతఁడే, నగరములోని ప్రజాపీడకుల సంహరించి, రాజ్యమునకు స్వాస్థ్యమును దెచ్చెను. ఇతని రూపమున, రోమకు లోక యిత్తడి ప్రతిమను నిరూపించి, నగరములో స్థాపించిరి. ఇతఁడు చదువుకొనిన వాఁడైనను, మహా కఠినుఁడు. ఆ వంశములోనివాఁడైన మార్కసు-బ్రూటసు చదువుకొని నెమ్మదియైనవాఁడు; మెత్తని చిత్తముగలవాడు. జూలియసుసీౙరును చంపుటకు గూడిన కుట్రదారులలో నొకఁ డైనను, దౌర్జన్యమును జేసినవాఁడు 'కాసియసు' యనువాఁడు గాని, యతఁడు కాఁడు. అతఁ డుదారపురుషుఁ డని వాడుక. అతఁడు కులీనుఁ డని కొందఱు, కాఁడని కొందఱు చెప్పుదురు. ఏది ఎట్లున్నను, ఇతని పూర్వికులలో మూఁడు, నాలుగు తరములలోనివారు సర్కారుద్యోగము చేసినటుల కానవచ్చుచున్నది.

గ్రీకు వేదాంతియైన 'ప్లేటో' మత మతఁ డవలంబించెను. లాటినుభాషలోఁ జదువ, వ్రాయ, నుపన్యసించుటకుఁ

107