పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

97


గారణ మతనికిఁ దెలియలేదు. ఈ సంగతి సైనికులు విని తమ్మును విడిచి పాంపేయుఁడు వెళ్లుటకు వారు సమ్మతించలేదు. సేనాధిపతియందు మిగుల బద్దానురాగులైనందున వా రతనిని నేనాధిపత్యము విడువవల దని నిరోధించిరి. కాని వారి నతఁ డెంత సమాధానముఁ జేయఁ దలఁచినను వా రతని మాటల సరకు సేయక, అతని నధికారుల యాజ్ఞకు వ్యతిరేకముగ నడువవలసిన దని ప్రోత్సాహముఁ జేసిరి. “ నే నధికారుల యాజ్ఞకు వ్యతిరేకముగ నడువలేను. మీరు నన్నిటుల నిర్బంధముఁ జేసిన యెడల నే నాత్మహత్యఁ జేసికొనియెద"నని వారితోఁ జెప్పి దండును వెంటఁబెట్టుకొని రాజధానికిఁ బోవుటకుఁ బ్రయత్నముఁ జేసెను.

సర్వాధికారియగుటకు పాంపేయుఁడు ప్రయత్నించుచుండె నని రోముపట్టణములో వదంతి పుట్టినందున సిల్లుఁ డతనిని సేనాధిపత్యము వదలి పట్టణమునకు రావలసిన దని యుత్తరువు చేసెను. మహా వైభవముతో పాంపేయుఁడు రాజధానికి వచ్చి జయప్రవేశముఁ జేయవలెనని యత్నించెను. అది పూర్వాచారమునకు విరుద్ధ మని సిల్లుఁడు వాదించెను గాని పాంపేయుఁ డందులకొల్లక నాలుగేనుఁగులచే లాగఁబడిన రథమునెక్కి జయద్వారముగుండఁ బట్టణములోఁ బ్రవేశించెను.

'దుందుభి ఖంజరి మర్దళ భేరీరవంబులు' మిన్నుమ్రోయ