పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


సిల్లుఁ డతనితో సంబంధముఁ జేయుటకుఁ దలపెట్టి దంపతు లిరువురు నేకీభవించి తమ కోడలి నతని కిచ్చి వివాహముఁ జేయుటకు సమకట్టిరి. ఇంతకన్న క్రూరమైనకార్యము మఱి యొకటి లేదు. అతని మొదటి భార్య (అంతస్థి) నెలదప్పి యుండెను. అతనిమూలమున నామె తండ్రి మరణము నొందెను. ఈ దుఃఖమును బట్టలేక యామె తల్లి యాత్మహత్య చేసికొనఁబూని యుండెను. దీనికి తోడుగ పాంపేయుఁడు రెండవ వివాహ మాడునను వార్త వినవచ్చెను. అతఁడు వివాహమాడఁ దలఁచిన పడుచు గర్భముధరించి యుండెను. ఇంతలో 'అంతస్థి' ప్రసవమై పురిటిచావుఁ జచ్చెను..

తదనంతరము 'సిసిలీ'ద్వీపములోఁ గొందఱు రాజ్యాధికారులపైని తిరుగఁబడిరి. వారిని దండించుటకు పాంపేయుఁ డా ద్వీపమునకు వెళ్లి వారిని మాపివేసెను. ఇంతకు లోపున నాఫ్రికాఖండములో నుత్తరభాగమునఁ గొన్ని యల్లరులు పుట్టినందున వాని నణఁగఁగొట్టుటకు 'సెనేటు' సభవారు, సిల్లుఁడును, పాంపేయున కుత్తరువుచేసిరి. అతఁ డా ప్రకారము ఆఫ్రికాఖండముసకు దండుతో వెడలి వెళ్లెను. అక్కడ ఘోరాహనములో శత్రువులఁ దునుమాడి యతఁడు జయముఁ బొందెను.

ఇంతలో నతనిని సేనాధిపత్యమును విడిచి, చాజధానికి రావలసిన దని సిల్లుఁ డుత్తరములు వ్రాసిపంపెను. ఇందుకుఁ