పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పెరికిలీసు

'పెరికిలీసు'యొక్క తల్లిదండ్రుల వంశములవారు 'ఆథెన్సు' పట్టణములో ఘనతకెక్కిరి. ఇతని తండ్రి మహాశూరుఁడు. మైకేలుయొద్ద జరిగిన యుద్ధములో నితఁడు ప్రసిద్ధికెక్కెను. ఒక రోజున సింహపు పిల్లను బ్రసవమైతి నని యతని తల్లి కలఁగనెను. కొన్ని రోజులకు పెరికిలీసు భూపతనమయ్యెను. అతఁడు శరీర సౌష్ఠవము కలవాఁడు. అతని శిరస్సుమాత్రము కొంచెము పొడవుగ నుండెను.

అతనికి సంగీతములోఁ బ్రవేశముగలదు. ప్రకృతిశాస్త్రములోను తత్వములోను నతఁడు వ్యవసాయముఁ జేసెను. తర్క శాస్త్రము నతఁ ఢభ్యసించెను. వాగ్వాదియని యతఁడు గొంత పేరొందెను. 'అనాక్షారుఁ'డను వానివద్ద నీ విద్య నతఁడు నేర్చుకొనెను. గురుశిక్షను బొంది, మృదుమధురమైన రచన గలిగినవాఁడగుట మహత్కార్యములను జేయుట కతని బుద్ది గమనించెను గాని స్వల్ప విషయములలో నది ప్రసరించ లేదు. ఎప్పుడు నతఁడు మౌనముద్రను ధరించి యుండెను; పక పకమని వెఱ్ఱి నవ్వులు నవ్వువాఁడుగాఁడు; మందముగ మాటలాడును; ప్రసన్నవదనుఁ డైనను, ముఖమును చూచిన దీర్ఘా

85