పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


రాత్రివలె నుండెను, క్రాసస్సు వ్యసనముతోఁగూడ చీఁకటి గదిలోఁ బ్రవేశించి విలపించుచుండెను.

అప్పుడు యోధులందఱు సమావేశమై వీరసభ నొకటి చేసి దానిలో పరారియగుటకు సన్నాహముఁ జేయవలసిన దని కూడఁ బలుకుకొని వా రందఱు లేచిపోయిరి. క్రాసస్సు కూడ వారితో కలిసిపోయెను. దుర్బలు లందఱు శిబిరములలో నుండుటచేత మరునాఁడుదయమున నాలుగువేల మందిని శత్రువులు ఖండించిరి. పాఱిపోవుచున్న రోమనులను దారిలో కలిసి పార్థులు వారిని సంహరించిరి. అందులో 'క్రాసస్సు' కూడ నేలఁబడి వీరస్వర్గము నొందెను.

కలిగిన దానితో సంతుష్టినొందక దురాశచేత విశేషముగ ధనము నార్జన చేయవలెనని సమకట్టి పరదేశములకుఁ బోయి శక్తి లేని పనుల నారంభించి క్రాసస్సు తుదకు దుర్మరణము నొందెను. ఈ విషయము క్రీ. పూ. సం|| 80-53 రములలో జరిగెను.