పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మార్కసు క్రాసస్సు

83


దించవలె నని క్రాసస్సు కోరి తుద కతఁడు దురవస్థనుఁ బొంది స్వదేశమునకు దుర్దినములను దెచ్చెను. వీరు మువ్వురు కలిసి స్వతంత్రముగ రాజ్యము నేలవలెననికూడఁ బలుకుకొని రోమను రాజ్యమును మూఁడు భాగములుగఁ జేసికొనిరి. సిరియా దేశము క్రాసస్సు వంతుకు వచ్చెను. అతఁ డందులకు సంతసించి యా దేశమునకుఁ బోయి దానినిఁ బరిపాలించెను.

అతఁ డక్కడనుండిన సమయమున 'పార్థుల'నువారితో రోమనులకు జగడము నచ్చెను. అందులో రోమనుల నాయకుఁడు గనుక క్రాసస్సు సైన్యములను వెంటఁ బెట్టుకొని యుద్ధమునకు నడిచెను. మహాఘోరముగ రెండు కక్షలవారు పోరాడిరి. క్రాసస్సు కుమారుఁడు రణములో మరణము నొందెను. క్రాసస్సుయొక్క స్నేహితులు వ్రాలిరి. కాసస్సు కుమారునియొక్క శిరమును బల్లెము కొనకు తగిలించి దానిని పార్థులు తెచ్చి రోమనుల యెదుట నుంచిరి. దానిని జూచి రోమనులు ధైర్యము చెడి వ్యసనపడిరి. "ఈ మహాశూరుఁడు వీరుఁడు కాని క్రాసస్సుయొక్క కుమారుఁడు కాఁ"డని వారితో పార్థులు చెప్పిరి. క్రాసస్సు విచారించి స్వసైన్యము నుత్సహించెనుగాని వారు నిరుత్సాహులైరి. యుద్ధము చాలించి లోఁబడవలసిన దని పార్థులు రోమనులకు చెప్పి వెళ్లిరి. వారు పరారి కాకుండ సైన్యమును నాలుగు వైపులనుంచి శత్రువులా రాత్రి వైజయంతికలలో వెళ్లఁబుచ్చిరి. ఆ రాత్రి రోమనులకుఁ గాల